అనపర్తి కెనాల్ రోడ్డులో ఉన్న పగల ముఖీదేవి ఆలయంలో మంగళవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనపర్తికి చెందిన మణికంఠ స్వామి నల్లమిల్లి గెలిస్తే కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టి మణికంఠ స్వామి మొక్కును చెల్లించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నసమరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.