అనపర్తి 4వ సచివాలయం వద్ద కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుమేరకు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి బుధవారం మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు.