అనపర్తి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ

64చూసినవారు
అనపర్తి, లక్ష్మీ నరసాపురం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మంగళవారం శ్రీకారం చుట్టారు. అనపర్తి పాతపూర్ లో రూ. 50లక్షల ఎంపీ లాడ్ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అదేవిధంగా లక్ష్మీ నరసాపురంలో నూతనంగా నిర్మించిన సిసి రహదారులను ప్రారంభించారు. ముందుగా అనపర్తి కెనాల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బిజెపి పతాకాన్ని ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్