ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపిగా బాధ్యతలు స్వీకరించిన ద్వారక తిరుమలరావును మంగళగిరిలోని బిజెపి కార్యాలయంలో శనివారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పసుపుగుచ్చం అందజేసి తిరుమలరావుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి సత్కరించి జ్ఞాపికను అందజేశారు. నల్లమల్లి వెంట బీజేపీ నేత పాతూరి నాగభూషణం పాల్గొన్నారు.