ఊలపల్లి: శ్యామలాంబ అమ్మవారి జాతర
బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో శనివారం రాత్రి శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం ఘనంగా సత్కరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి పోటెత్తారు.