పెదపూడి మండలం, పెద్దాడ గ్రామ పంచాయితీకి అతి సమీపంలో, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు రోడ్డు మధ్యలో తీసిన గుంతను ఏర్పాటు చేసి దాదాపు రెండు వారాలు గడుస్తున్న, దాని మరమ్మద్దులను సంబంధిత అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. పారిశుద్ధ్యమే పరమావధిగా పనిచేస్తున్న అధికారులు, పారిశుద్ధ్య వాహనాలకు ఇబ్బందికరంగా మారిన రహదారిని మెరుగుపరచాలని స్థానికులు కోరుచున్నారు.