కొప్పవరంలో టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల అందజేత

81చూసినవారు
అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన బండారు రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్త రెండు నెలల క్రితం యాక్సిడెంట్లో మృతి చెందారు. ఈ సందర్భంగా టిడిపి నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి కొప్పవరంలో బండారు రామకృష్ణ కుటుంబాన్ని బుధవారం పరామర్శించి, టీడీపీ నుంచి మంజూరైన రూ. 5లక్షల భీమా సొమ్మును వారి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్