తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ఆదివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడింది. సుమారు అరగంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. వర్షం తాలూకు ప్రభావంతో రోడ్లు జలమయమయ్యాయి. అలాగే, ఆదివారం మార్కెట్లో వ్యాపారులు భారీ నష్టాన్ని చవి చూశారు. దుకాణాల్లోకి నీరు చేరడంతో సరుకులు నాశనం కావడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేసారు.