అనపర్తి మండలం కుతుకులూరు లో వైసీపీ నేత పడాల హరి సాయి కృష్ణారెడ్డి తనతో అసత్య ఆరోపణలు చేయించారంటూ గ్రామానికి చెందిన వైసిపి నేత పడాల శ్రీనివాస్ రెడ్డి ఆదివారం రెండవ రోజు నిరసన కొనసాగించారు. కాగా మొదటిరోజు శాంతియుతంగా నిరసన చేపట్టిన ఆయన రెండవ రోజు స్థానిక నాయకులు వాలంటీర్లతో కలిసి వంట వార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.