ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా అనపర్తిలో ఆదివారం కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి నియంత్రణ టీకాలు వేశారు. టీడీపీ నేతలు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, తమలంపూడి సుధాకర్ రెడ్డి, మల్లిడి నారాయణరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు వైద్యులు, పశుసంవర్ధక శాఖ ఏడీ శ్రీనివాసరావు ప్రజలకు జూనోసిస్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు.