గండేపల్లి మండలంలోని సూరంపాలెం ఆదిత్య విశ్వవిద్యాలయంలో హాస్టల్ వార్డెన్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రౌతులపూడి మండలం మెరక గ్రామానికి చెందిన నిండికుండల నాగమల్లిక హాస్టల్ వార్డెన్ గా పని చేస్తుంది. నిన్న అర్ధరాత్రి వసతిగృహంలోని ఓ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల సిబ్బంది పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.