
గన్నవరం చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మంగళగిరి జనసేన కార్యాలయానికి వెళ్లనున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్లో పిఠాపురం బయలుదేరి, అక్కడ జనసేన జయకేతనం ఆవిర్భావ దినోత్సవ సభకు హాజరవుతారు. సభ ముగిసిన అనంతరం రాత్రి JNTU కాకినాడ పోలీస్ గ్రౌండ్స్ గెస్ట్ హౌస్లో బస చేస్తారు.