మామిడికుదురు పురవీధుల్లో పుంగనూరు గిట్టల బండి శుక్రవారం సందడి చేసింది. రెండెడ్ల గిత్తల బండిపై యజమాని పెదపట్నం గ్రామానికి చెందిన ముత్యాల గణపతి సవారి చేస్తూ సందడి చేశారు. చిన్న బండి కావడంతో ప్రజలు ఆసక్తిగా పుంగనూరు గిట్టల సవారిని తిలకించారు. టేకు కలపతో సరదాగా ఈ బండిని చేయించానని గణపతి తెలిపారు. పలువురు ఈ బండిని స్థానికంగా జరిగే ఫంక్షన్లలో సరదాగా ప్రదర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.