అయినవిల్లి మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడ కోడిపందాలు గుండాటలు నిర్వహించడానికి ఎటువంటి అనుమతి లేదని తహసీల్దార్ నాగలక్ష్మమ్మ, ఎస్సై మనోహర్ జోషి తెలిపారు. మండల పరిధిలోని సిరిపల్లి, తొత్తరమూడి గ్రామాల్లో శనివారం పర్యటించారు. కోడి పందాలు జరిగే ప్రాంతాల్లో లక్షలు ఏర్పాటు చేశారు. కోడి పందాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.