అయినవిల్లి మండలంలోని లంక ప్రధాన రహదారి పక్కన ఉన్న ఫ్యూజ్ బాక్స్ ప్రమాదకరంగా మారింది. తక్కువ ఎత్తులో ఉండటంతో పశువులు, ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అటుగా వెళ్లేవారు ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఫ్యూజ్ బాక్స్‌ను తగిన ఎత్తులో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.