అయినవిల్లి: విద్యుత్ కోతతో అంధకారం

75చూసినవారు
అయినవిల్లి మండలంలో గత మూడు రోజుల నుంచి అప్రకటిత విద్యుత్ కోతలతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారులన్నీ అంధకారమయం అవుతున్నాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాలు చీకట్లో చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాలలో విద్యుత్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని ప్రజలు అంటున్నారు. ఉక్కపోతతో చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్