అయినవిల్లి: ప్రతికూల వాతావరణంతో రైతుల ఇక్కట్లు

67చూసినవారు
అయినవిల్లి మండలంలోని అయినవిల్లి సిరిపల్లి మాగంలో శుక్రవారం కురిసిన వర్షంతో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ధాన్యం తడిచిపోవడంతో రంగు మారిపోయి మొలకెత్తే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందారు. అగ్రికల్చర్ అధికారులు స్పందించి తమకి సంచులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. తడిసిన ధాన్యాలు రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్