అయినవిల్లి మండలం అయినవిల్లిలో వేంచేసి ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విగ్నేశ్వరుడి ఆలయం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తులు వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.