అయినవిల్లి మండలం కె. జగన్నాధపురం గ్రామంలో వికసించిన మే పుష్పాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. గ్రామంలో బీజేపీ రాష్ట్ర మహిళా నాయకులు యనమదల రాజ్యలక్ష్మి ఇంటి గార్డెన్ లో 2 మే పుష్పాలు వికసించాయి. ఈ పుష్పాలు సంవత్సరంలో మే నెలలో ఒక చెట్టు ఒక పువ్వు మాత్రమే వికసిస్తుంది అని ఆమె తెలిపారు. అందుకే ఆ పుష్పాలకు మే పుష్పం అని పేరు వచ్చింది అని అన్నారు.