అయినవిల్లి మండలం అంధకారం అయింది. ఆదివారం రాత్రి ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనితో అర్ధ రాత్రి 12 గంటలు దాటినా విద్యుత్ రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. బయట వర్షం కురిసిన ఇంటిలో వేడి తగ్గకపోవడంతో నిద్ర పట్టక సతమతమయ్యారు. రొయ్యల చెరువుల వారు విద్యుత్ లేక జనరేటర్ ల మీద ఆధారపడ్డారు.