గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లుగా పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలియజేశారు. అయినవిల్లి మండలం తొత్తరమూడిలో సీసీ రోడ్డు నిర్మాణానికి పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్య క్రమంలో ఎంపీడీవో సరోవర్, ఎస్ఐ హరికోటి శాస్త్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.