అయినవిల్లి: అకాల వర్షాలకు వాలిన వరి పంట

63చూసినవారు
అయినవిల్లి మండలం లో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో వేలాది ఎకరాలలో వరి పంట సాగు చేస్తున్నారు. అయితే పంట కోత దశకు వస్తున్న సమయంలో కురిసిన వర్షంతో పంట వాలిపోయింది. దీనితో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతం కన్నా ఇప్పుడు పెట్టు బడులు ఎక్కువయ్యాయని రైతులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్