అయినవిల్లి మండలం అయినవిల్లిలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విగ్నేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం జేష్ట మాసం శుద్ధ త్రయోదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా స్వామివారి ఆలయానికి రూ 1, 73, 544 ఆదాయం లభించిందని ఆలయ అధికారులు వెల్లడించారు. 1900 మంది స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అన్నారు.