అయినవిల్లి మండలం అయినవిల్లి లో వేంచేసి ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విగ్నేశ్వర స్వామి వారి ఆలయానికి బుధవారం రాష్ట్ర నలుమూలల నుండి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో భక్తుల నిర్వహించిన వివిధ సేవల ద్వారా స్వామివారి ఆలయానికి రూ 1, 96, 054 ఆదాయం లభించిందని ఆలయ అధికారులు తెలియజేశారు. 2, 400 మంచి భక్తులు అన్నదానాన్ని స్వీకరించారని వారు చెప్పారు.