అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి భక్తులు మంగళవారం వివిధ సేవలు ద్వారా 1, 12, 980 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 115 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. 19 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమం లో పాల్గొన్నారని తెలిపారు. 1800 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.