మామిడికుదురు మండలం పెదపట్నంలంక ఇసుక రీచ్ లో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇసుక రీచ్ ను శనివారం పార్టీ నేతలు వెంకటేశ్వరరావు, తమ్మయ్య నాయుడు, బాబులు పరిశీలించారు. ఒక్కొక్క ట్రాక్టర్ నుంచి అదనంగా రూ. 300 వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంతవరకు ఐదు వేల ట్రిప్పులు ఇసుక తీయడం జరిగిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇస్తున్నామని చెబుతున్నారని ఆరోపించారు.