అమలాపురం: ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి

82చూసినవారు
అమలాపురం ఎర్రవంతెన వద్ద ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నాయకుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర 20 సూత్రాల కమీషన్ చైర్మన్ లంకా దినకర్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. అంత్యోదయ సిద్ధాంతం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్