రాష్ట్ర 20 సూత్రాల కమిషన్ చైర్మన్ లంక దినకర్ అమలాపురం పర్యటనలో భాగంగా శుక్రవారం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం ఆయన సమక్షంలో బీజేపీలో పలువురు చేరారు. అమలాపురంకి చెందిన మహిళా నాయకురాలు కొండేటి జయలక్ష్మి మరియు పలువురు యువకులకు దినకర్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి దినకర్ సూచించారు.