అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో మంగళవారం రాత్రి సమయంలో ఒక తాచుపాము సత్యనారాయణ అనే వ్యక్తికి చెందిన ఇంట్లోకి ప్రవేశించింది. దాన్ని చూసిన ఇంట్లోని వ్యక్తులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించగా హుటాహుటిన అక్కడికి చేరుకున్న వర్మ పామును బంధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవికాలం కావడంతో పాములు ఇంట్లో ప్రవేశించే ప్రమాదం ఉందన్నారు.