పాడి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఆయన అంబాజీపేట మండలంలోని పసుపల్లి గ్రామంలో లబ్ధిదారులు ప్రభుత్వ రాయితీపై నిర్మించుకున్న మినీ గోకులం షెడ్డులను శుక్రవారం ప్రారంభించారు. పేదలందరికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.