అంబాజీపేట: మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

85చూసినవారు
ఇటీవల సింహాచలంలో జరిగిన గోడ కూలిన ఘటనలో అంబాజీపేటలోని కొర్లపాటివారిపాలెంకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను బుధవారం వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించి వైసీపీ అధిష్టానం ప్రకటించిన రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్