అంబాజీపేట మండలంలోని వక్కలంకలో చెరువు అభివృద్ధి పనులు మొదలయ్యాయి. ఈ పనులను పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో చెరువు అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాసంశెట్టి రేవతి పెదబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.