అంబాజీపేట మండలంలోని చిరుతపుడి గ్రామంలో ధాన్యం కనుగోలు కేంద్రాన్ని కొత్తపేట ఆర్డివో శ్రీకర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో రైతులందరూ అప్రమత్తంగా ఉండి తగు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, వరి కోతలు వాయిదా వేసుకోవాలని ఆర్డీవో సూచించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.