అంబాజీపేటకు చెందిన టీడీపీ ఎస్సీ సెల్ కార్యవర్గ కార్యదర్శి శ్రీనివాసరావు గురువారం విజయవాడలో మంత్రి అచ్చెన్నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై కాసేపు చర్చించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని అచ్చెన్నాయుడు సూచించినట్లు ఆయన తెలిపారు.