భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు

53చూసినవారు
భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు
పవిత్ర రంజాన్ వేడుకలను మామిడికుదురు మండలంలో బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మామిడికుదురు షియా జామియా మసీదు, నగరం గ్రామంలోని పెద పంజిషా, మొగలికుదురు మసీదులో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మత ప్రబోధకులు అలీ జైదీ, మెహదీ హసన్ బెహిష్టి, మహమ్మద్ ఇబ్రహీమ్ ముస్లింల చేత రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

సంబంధిత పోస్ట్