నీట మునిగిన చాకలిపాలెం కాజ్ వే

52చూసినవారు
నీట మునిగిన చాకలిపాలెం కాజ్ వే
పి. గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద అంబేద్కర్ కోనసీమ జిల్లా-పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే కనకాయిలంక కాజ్ వే ఆదివారం సాయంత్రం ముంపునకు గురైంది. కాజ్ వే పైనుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో రెండు జిల్లాల పరిధిలోని లంక గ్రామ ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. వరద ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్