చవితి ఉత్సవాలలో మట్టి గణపతులనే పూజించాలి

64చూసినవారు
సెప్టెంబర్ 7న నిర్వహించే వినాయక చవితి వేడుకలలో ప్రజలంతా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలని అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఈవో సత్యనారాయణ రాజు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవస్థానం తరఫున ప్రజలకు పంపిణీ చేసేందుకు మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయిస్తున్నామని తెలిపారు. భక్తులకు వీటిని అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్