అయినవిల్లి మండలం కె. జగన్నాథపురం గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామంలో గత మూడు రోజులుగా ముగ్గురిని కుక్కలు కరిచి గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. వారిలో ఒక వ్యక్తి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. రాత్రి సమయాలలో ప్రధాన రహదారి వెంబడి వాహనదారులను కుక్కలు వెంటాడి కరుస్తున్నాయని చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని శనివారం స్థానికులు కోరుతున్నారు.