గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేయాలని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. మామిడికుదురు మండలంలోని మామిడికుదురు ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీపీ వనజ అధ్యక్షుతన గురువారం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని ప్రజా ప్రతినిధులతో గ్రామాలలో సమస్యలను చర్చించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.