వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో నీటి ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ యూనిట్ అధికారి రాజబాబు తెలిపారు. మలేరియా మహోత్సవాల్లో భాగంగా శనివారం పుల్లేటికుర్రులో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని సీహెచ్ రవికుమార్ హెచ్చరించారు.