అయినవిల్లి మండలంలోని నల్లచెరువు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పూజలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారిని అలంకరించి ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్త దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.