ప్లాస్టిక్ వినియోగం వల్ల వాతావరణంలో అధిక మొత్తంలో కాలుష్యం ఏర్పడుతుందని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఆయన పి. గన్నవరం గ్రామంలో సర్పంచ్ బొండాడ నాగమణి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందన్నారు. గ్రామాలలో ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.