మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన నరసింహారావు మద్యం షాపు నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని నగరం ఎస్సై చైతన్య కుమార్ బుధవారం తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా షాపులు మూసివేయడంతో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు ఎస్సై చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 9, 780 విలువ చేసే 60 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అతన్ని అరెస్టు చేసి రిమాండు తరలించామని తెలిపారు.