డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో జనసేన నేతలు కంకిపాటి నరసింహారావు, తుండూరి బుజ్జి, బల్ల సతీష్, కుంపట్ల దుర్గారావు 11 రోజుల దీక్ష చేపట్టారు. మంగళవారంతో దీక్ష పూర్తయింది. అప్పనపల్లి నుంచి పాశర్లపూడి వరకు పాదయాత్ర చేసి అక్కడి నుంచి దీక్ష విరమించేందుకు తిరుపతి వెళ్లారు. నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు కార్యక్రమంలో పాల్గొన్నారు.