అయినవిల్లి మం. కె. జగన్నాధపురం గ్రామం గుత్తుల వారి పాలెం వెళ్లే దారిలో ట్రాన్స్ ఫార్మర్ బేస్ మొత్తం తుప్పు పట్టి ఒక పక్కకు వంగిపోయి ప్రమాదకరంగా ఉంది. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ట్రాన్స్ ఫార్మర్ ను చుట్టేశాయి. విద్యుత్ అస్తమానం హెచ్చు తగ్గులు అవుతుందని స్థానికులు అంటున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి విద్యుత్ పోతే మరునాడు మధ్యాహ్నం వరకు విద్యుత్ సప్లై లేదని, గ్రామానికి లైన్ మెన్ కూడా లేడని వాపోతున్నారు. విద్యుత్ అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు.