రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ప్రభుత్వం చేపడుతున్న స్వర్ణాంధ్ర-2047 కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యలు కావాలని పి. గన్నవరం మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు అంబటి భూలక్ష్మి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. మండలంలోని ముంగండ గ్రామంలో ప్రజలకు కూటమి నాయకులతో కలిసి ఆమె మంగళవారం స్వర్ణాంధ్ర కరపత్రాలను అందజేశారు. కార్యకర్తలు పాల్గొన్నారు.