అనాతవరంలో లారీ - ఐచర్ వ్యాన్ ఢీ

63చూసినవారు
అనాతవరంలో లారీ - ఐచర్ వ్యాన్ ఢీ
ముమ్మిడివరం మండలం అనాతవరం వై జంక్షన్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఎదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ కొన్నాయి. చేపల లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఐచర్ వ్యాను ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. అయితే ఢీకొన్న లారీలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పెళ్లిళ్లకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముమ్మిడివరం పోలీసులు లారీలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

సంబంధిత పోస్ట్