రాజోలు నియోజకవర్గం మలికిపురం లోని ఒక ప్రైవేటు విద్యా సంస్థ స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం తో మంగళవారం సాయంత్రం పాపారావు హాస్పిటల్ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద పుట్ పాత్ ను బస్ బలంగా ఢీకొట్టింది. అక్కడ చిన్న గోడను గుద్దుకుని బస్ ఆగకపోయుంటే ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొట్టేదని, తృటిలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.