మామిడికుదురు: రోడ్డు అభివృద్ధి కోరుతూ ధర్నా

52చూసినవారు
మామిడికుదురు మండలంలోని బి. దొడ్డవరం పెదపట్నంలంక ఆర్ అండ్ బీ రోడ్డు అభివృద్ధి కోరుతూ స్థానికులు బుధవారం ధర్నా చేశారు. రోడ్డు అధ్వానంగా మారిందని, దానిని తక్షణం ఆధునీకరించాలని స్థానికులు డిమాండ్ చేశారు. రోడ్డు పాడైపోయి ఎంతో కాలం నుంచి ఇబ్బంది పడుతున్న దాని అభివృద్ధి ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం రోడ్డు అభివృద్ధి చేయని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్థానికులు హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్