మామిడికుదురు మండల పరిధిలోని 18 గ్రామాల్లో 9, 956 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తామని ఎంపీడీవో వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. దీనికి సంబంధించి రూ. 4, 08, 96, 000 నిధులు విడుదల చేశామన్నారు. శనివారం ఉదయం నుంచి పెన్షన్లు అందించేలా ఏర్పాట్లు చేశామని ఒకటో తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందించనున్నామన్నారు.